🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ లంగర్-ఎ-ముహమ్మద్

*తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో*

వరంగల్,ఆగస్టు 26*

మిలాద్-ఉన్-నబీ(సల్లల్లాహు అలైహి వసల్లం)పర్వదినాన్ని పురస్కరించుకుని తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ లంగర్-ఎ-ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాది మంది పేదలు,నిరుపేదలు,సామాన్య ప్రజలకు అన్నదానం చేశారు.ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ముహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన లంగర్‌కు ప్రవక్త భక్తులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు భక్తులకు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి సేవలందించారు.మత సామరస్యం,సేవాభావం,పేదలకు అండగా నిలవడం లక్ష్యంగా తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ చాంద్ పాషా,మహమ్మద్ మషూక్,హసన్ అలీ బెగ్,దస్తగీర్,మహమ్మద్ షఫీ,రౌఫ్,అంకుష్ తదితరులు పాల్గొన్నారు..
🏠 Home