🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

ఒగ్లాపూర్ సైలాని బాబా దర్గాలో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

*తెలంగాణ/వరంగల్,ఆగస్టు 26*

వరంగల్‌: మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగలాపూర్‌లోని సైలాని బాబా దర్గాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదానం చేశారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా సైలాని బాబా మాట్లాడుతూ కుల,మత,వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యంగా జీవించడమే ప్రవక్త మహమ్మద్‌ బోధనల సారాంశమని అన్నారు.మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినం ప్రజలందరిలో ప్రేమ,సౌభ్రాతృత్వం,మానవతా దృక్పథాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయతలతో కలిసిమెలిసి జీవిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రసిద్ధ దర్గాలకు సంబంధించిన విశిష్ట వస్తువులను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించారు.కార్యక్రమానికి వేలాది మంది భక్తులు సైలాని బాబా దర్గాకు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో సయ్యద్‌ అమెర్‌,షేక్‌ మెయిన్‌,దర్గా నిర్వాహకులు,భక్తులు,ఇరువర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home