🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

ప్రజాస్వామ్యంపై యువతకు అవగాహన అవసరం

, తెలంగాణ స్టేట్ మాక్ అసెంబ్లీలో విష్ణు రెడ్డి
వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన VAGMUN (Vaagdevi Model United Nations), తెలంగాణ స్టేట్ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు యువ నాయకుడు విష్ణు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

మోడల్ యునైటెడ్ నేషన్స్, మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి, వాటిపై బాధ్యతాయుతంగా చర్చించడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం వంటి అంశాలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.

విద్యార్థి దశ నుంచే సమాజంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని, వాటి పరిష్కారానికి ఆలోచించే దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు వంటి అంశాలపై యువత చైతన్యంతో ఉండాలని అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home