దళిత సమాజానికి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
మోత్కూర్ సెప్టెంబర్ 10 (జన చరిత్ర):భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల పిచ్చితో రెచ్చగొట్టి యావత్ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుచుటకు ఉసిగొల్పిన కేసీఆర్ తక్షణమే దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ,ప్రత్యేక తెలంగాణ సాధనలో దళితుల డప్పు లేనిదే నీ ఉద్యమం లేదనే విషయం మరవొద్దని, దళిత ముఖ్యమంత్రి పేరుతో దళితులను దగా చేసిన ఘనుడివి నీవేనని మరవద్దు,మొన్న జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిపై నీ జంట బీజేపీ కులపిచ్చి ఆగడాలకు పాల్పడిన సంఘటన మరవక ముందే,నేడు నీ బిఆర్ఎస్ కుల అహంకార చర్యలు రెండు కూడా ఒక్కటే అని, మీ రెండు పార్టీల మధ్య సిద్ధాంతపరమైన తేడా లేదని దళితుల విషయంలో ఇరు పార్టీల వైఖరి ఒకటేనని స్పష్టమౌతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీపై విమర్శ కాదు, దళిత సమాజాన్ని అవమానపరిచి,అంటరానితన భావజాలాన్ని ప్రోత్సహించే ప్రమాదకరమైన చర్యగా భావిస్తూ, కేసిఆర్ నిజంగా దళితుల పట్ల గౌరవం కల్గిన నాయకుడైతే , తన ఫామ్ హౌస్ వద్ద దళితులు నిరసన తెల్పిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయించిన ఘటనపై వెంటనే స్పందించి,ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడిన తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడంతో పాటు యావత్ దళిత సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బహుజనుల పక్షాన హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో.... ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు గుండాగోని రామచంద్రు గౌడ్, నాయకులు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,బద్దం నాగార్జున్ రెడ్డి, గడ్డం సోంనర్సయ్య, లెంకల వేణు, గణగాని నర్సింహా, గడ్డం లక్ష్మయ్య, కందుకూరి మురళి,దాచారం గ్రామశాఖ అధ్యక్షులు సూరారం నవీన్, sk సజీద్,ఎడ్ల భగవంత్,రంగారెడ్డి, జిట్టా లక్ష్మయ్య, కోమటి జనార్దన్, ఆలకుంట్ల రాజు,ఆలకుంట్ల నర్సింహా,కురిమెటి సైదులు, కురిమెటి విక్రమ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు..