🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
వర్ధన్నపేట: తెలంగాణ వీర వనిత, పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ ఘన నివాళులు అర్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వన్నాల వెంకటరమణ స్వగృహంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణికగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు డాక్టర్ వన్నాల వెంకటరమణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాయపురపు కుమారస్వామి, కాశీబుగ్గ మండల అధ్యక్షుడు అపురూప రజనీష్ నేత, సీనియర్ నాయకులు దూడయ్య, సంపత్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
🏠 Home