రంగసాయిపేటలో ఘనంగా 29వ ఉర్సు వేడుకలు
వరంగల్: రంగసాయిపేటలోని హజరత్ ఖాజా సయ్యద్ అలీషా ఖాద్రి చిష్టి 29వ ఉర్సు ముబారక్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఉర్సు హవేలీ పీఠాధిపతి యాహియా పాషా అలియాస్ షోయబ్ బాబా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం కమిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సాదిక్ పాషా,అబ్బూ ఖాన్,సలీం,కాంగ్రెస్ నాయకులు కుచన ఏకాంబరం,మూగ రామ్మోహన్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.