🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకుందాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి. పర్వతగిరిలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు తయారుచేసిన మట్టి వినాయకులను ప్రదర్శిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. విద్యార్థులు తయారుచేసిన మట్టి గణపతులు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టి వినాయకులను ఆరాధించి మన పర్యావరణానికి మేలును కలిగించే విధంగా భగవంతుడిని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీపాక రమేష్ బాబు గారు, స్టాఫ్ సెక్రటరీ శానం వెంకన్న మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
🏠 Home