జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం వరంగల్,హనుమకొండ జిల్లాల్లో ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తులు
*తెలంగాణ వరంగల్,సెప్టెంబర్ 12*
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా వరంగల్,హనుమకొండ జిల్లాల్లో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం ప్రారంభించారు.వరంగల్,హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థల చైర్‌పర్సన్లు బి.వి.నిర్మలా గీతాంబ,ఎం.రామకృష్ణ సునీత న్యాయ సేవా సదనం భవనంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ,డీసీపీ ధార కవిత,న్యాయమూర్తులు,న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు సి.హెచ్.ఉపేందర్,చొల్లేటి రామకృష్ణ,ఇతర న్యాయవాదులు,లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు,వివిధ బ్యాంకులు,బీమా సంస్థల అధికారులు,కక్షిదారులు పాల్గొన్నారు.జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించబడిన కేసుల వివరాలను సాయంత్రం వెల్లడించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తెలిపారు.