🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 14 Sep, 2026 | Page: 1

రాంకీ విల్లాలో భక్తిశ్రద్ధలతో మట్టి వినాయకుని పూజ

పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మట్టి వినాయకుని ప్రతిష్ఠ — రాంకీ కుటుంబ సభ్యుల సామూహిక పూజలు

వరంగల్: రాంకీ విల్లా ఓనర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాంకీ విల్లాస్‌లో మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలకు శ్రీకారం చుట్టారు.

బ్రాహ్మణోత్తములు గోపి, అరుణ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు మరియు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి విగ్రహ దాత చల్ల యాకుబ్ రెడ్డి, కేతిరెడ్డి సోమేశ్వర్ రెడ్డి దంపతులు, వెంకన్న దాలియా విష్ణూ కబ్రా శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రవణ్, బేతి సాయి తదితరులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే రాంకీ విల్లా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.

వినాయకుని ఆశీస్సులతో రాంకీ విల్లా కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాంకీ విల్లా సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంతో రాంకీ విల్లాస్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
🏠 Home