🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 14 Sep, 2026 | Page: 1

లోక్ అదాలత్‌ ద్వారా 8,288 కేసులు పరిష్కారం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కు విశేష స్పందన లభించిందని వీటి ద్వారా *8,288 కేసులు* పరిష్కార మయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 93 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని.
నిన్న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన మొత్తం కేసుల్లో కేసుల్లో *ఎఫ్ఐఆర్ కేసులు -1595,* *ఈ పెట్టి కేసులు -2171,* *మోటార్ వెహికల్ చట్టం కేసులు-4522,* *సైబర్ కేసులు -134* పరిష్కరించడం ద్వారా బాధితులకు సంబంధించి వివిధ బ్యాంక్ ఖాతాల్లో నిలుపుదల చేసిన 93,30,616/- రూపాయలు బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు వెలుబడించింది.
రాజీ మార్గం రాజా మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. అదేవిధంగా లోక్‌ అదాలత్‌ సద్వినియోగానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు.
🏠 Home