గొల్లవాడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు
గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని గొల్లవాడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నేడు మొదటి రోజు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. దీంతో అర్చకులు భాగవతుల మోహన్ శర్మ విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పాడిపంటలు సమృద్ధిగా పండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు.