కళాకారులపై కపట ప్రేమ చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా మా ఆట పాటతో స్వరాష్ట్రం సాధించుటలో ముందు వరుసలో ఉన్న కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తా ఉంది . ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిపోతున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఇస్తానన్న1000 ఉద్యోగాలు ఏమాయే ఇలాగే కళాకారులపై చిన్న చూపు చూస్తే మా ఆటపాటలతో కాళ్లకు గజ్జలు గచ్చి భుజాన గొంగడేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని త్వరలో జూపల్లి మంత్రి కృష్ణారావు గారు మాకు సమాధానం చెప్పాలి. లేకపోతే రవీంద్ర భారతిని 33 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరూ.కళాకారులు కదిలి కదం తొక్కి ఆటపాటలతో నీ రవీంద్ర భారతిని ముట్టడిస్తున్నామని హెచ్చరిస్తున్నా మనీ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంగం జిల్లా అధ్యక్షులు నల్లగొండ పందిరి సైదన్న ప్రకటనలో తెలియజేశారు