ఆమిర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ‘సియాసత్’ కీలక పాత్ర రజా అహ్సాన్
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 15*
జనగామ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ‘సియాసత్’ దినపత్రిక,దాని న్యూస్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారని మెకానికల్ ఇంజనీర్,యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ రజా అహ్సాన్ అన్నారు.2023 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,మండలాల్లో పర్యటించి సభలు,కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ముస్లింలను కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఆమిర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారని తెలిపారు.‘సియాసత్’ద్వారా ముస్లింల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి రాజకీయ చైతన్యం కల్పించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమిర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ముస్లింలలో ఆనందం నెలకొందని రజా అహ్సాన్ అన్నారు.అయితే సుమారు ఏడాదిన్నర తర్వాత ఆయన స్థానంలో అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ముస్లింలలో అసంతృప్తికి దారితీసిందని పేర్కొన్నారు.ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.నవంబర్‌లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని ఆమిర్ అలీ ఖాన్‌కు కేటాయించి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి రజా అహ్సాన్ విజ్ఞప్తి చేశారు.2023లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారని,2028లోనూ ఆ మద్దతు కొనసాగాలంటే ఆమిర్ అలీ ఖాన్‌కు తిరిగి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి ముస్లింలలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కోరారు.స్థానిక సంస్థలు,కార్పొరేషన్ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.