🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 15 Sep, 2026 | Page: 1

గుడిమల్ల వెంకటేశ్వర్లుకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో హర్షనీయమని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

ఉర్సు ప్రతాప్ నగర్ ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న శంభుని పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గుడిమల్ల వెంకటేశ్వర్లుకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో హర్షనీయమని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు ఉర్సు ప్రతాప్ నగర్ లో జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత గుడిమల్ల వెంకటేశ్వర్లను మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి మరుపళ్ల భాగ్యలక్ష్మి లు శాలువా కప్పి బొకే ఇచ్చి సన్మానించినారు మరుపల్ల రవి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వెంకటేశ్వర్లు తమ మేధస్సుతో ఎంతోమంది విద్యార్థులకు బోధన చేసి వారిని ప్రయోజకులుగా చేయాలని రాబోవు రోజులలో మరిన్ని అవార్డులు తీసుకొని మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఆయనను కోరినారు ఇట్టి సన్మాన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి స్థానిక నాయకులు మరుపల్ల గౌతం మరుపల్ల ఈశ్వర్ ప్రసాద్ కుడికాల సాంబశివరావు గుడిమల్ల రవి అంకం రామనాథం మరుపల్ల శివ గుడిమెల్ల సురేష్ మంద ప్రసాద్ మరుపల్ల సాయి వర్ధన్ సిరిమల్ల సాయికుమార్ లు ఉన్నారు
🏠 Home