🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 16 Sep, 2026 | Page: 1

దుర్గంధంలో వరంగల్ కూరగాయల మార్కెట్ మూడు రోజులుగా పేరుకుపోయిన చెత్త.. పట్టించుకోని అధికారులు ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు, వ్యాపారస్తులు

వరంగల్: నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయి. గత మూడు రోజులుగా మార్కెట్‌లోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది.
కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వినియోగదారులు మార్కెట్‌కు వస్తుంటారు. అయితే చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, అపరిశుభ్రత మధ్యే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులు కూడా చెత్త కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
మార్కెట్‌లో పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వినియోగదారులు, వ్యాపారస్తులు కోరుతున్నారు. చెత్తను వెంటనే తొలగించి మార్కెట్ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడు రోజులుగా చెత్త పేరుకుపోయినా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
🏠 Home