🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 16 Sep, 2026 | Page: 1

అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు... నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ కార్డులను తీసుకువచ్చిందని నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు.
బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పచ్చల సోమేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డును పంపిణీ చేసిందని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులుగా డిజిటలైజేషన్ చేసి పంపిణీ చేస్తుందని తెలిపారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లో మొత్తం 62,853 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు.
మూడు రోజుల పాటు అన్ని డివిజన్లో వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు చేస్తున్నామని, దీనివల్ల రేషన్ పంపిణీలో పారదర్శకత పెరిగి అవకతవకలకు అడ్డుకట్టపడుతుందని వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ రేషన్ షాపులో బియ్యం తీసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హాయంలో రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయగా వాటిని ఎవరు సరిగ్గా తినేవారు కారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వకారణమని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రత్యేక నిధుల ద్వారా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేషన్ ను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే పట్టణంలోని అన్ని డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు.
పానగల్ పచ్చల సోమేశ్వరాలయం నుంచి బైపాస్ రోడ్డు కూడా వేయడం జరిగిందని తెలిపారు.
పట్టణంలోని రూ.100 కోట్లతో చేపడుతున్న బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టల ఘాట్ రోడ్డు పనులు చురుకుగా జరుగుతున్నాయని అన్నారు.
దీంతో నల్లగొండను పర్యటకంగా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు.

స్థానిక కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు (చిట్టి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ ,ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వంశీకృష్ణ, తహసిల్దార్ పరశురాములు, పలువురు కార్పొరేటర్లు, వార్డ్ ఆఫీసర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home