రైలులో పోగొట్టుకున్న మొబైల్ అప్పగింత 139కు ఫిర్యాదు..వెతికి పట్టుకున్న రైల్వే పోలీసులు
తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 16
వరంగల్: రైలులో ప్రయాణిస్తూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను జీఆర్‌పీ పోలీసులు వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు.వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా వాసి భోగిరెడ్డి వసంత(25)హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ నెల 12న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా రూ.13,300 విలువైన రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను రైలులో మర్చిపోయారు.దీంతో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫిర్యాదు చేశారు.వరంగల్ జీఆర్‌పీ సీఐ వి.నరేశ్‌కుమార్ ఆదేశాల మేరకు నైట్ ట్రైన్ పెట్రోలింగ్ సిబ్బంది కే.దినేశ్ ఫోన్ కోసం గాలింపు చేపట్టి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం బుధవారం భోగిరెడ్డి వసంతను జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్‌ను ఆమెకు అప్పగించారు.