ఉద్యమకారుల మనోభావాలు దెబ్బ తినే విధంగా నేటి సర్కార్ వ్యవహరిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచకపోవడం చాలా దురదృష్టకరమని జైలు జీవనం రిమాండ్ అయిన ఉద్యమకారుల మనోభావాలు దెబ్బ తినే విధంగా నేటి సర్కార్ వ్యవహరిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శివ నగర్ లోని ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు నల్ల కండువాలు ధరించి ధర్నా కార్యక్రమం చేపట్టినారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని కమిటీలు వద్దురా హామీలు నెరవేర్చాలి రా ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినారు వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటంలు నిర్వహించిన ఉద్యమకారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఇప్పటివరకు అసలైన ఉద్యమకారు లను గుర్తించలేకపోయినారని చేతకాని ప్రభుత్వ ఉన్న ఒకటే లేకున్నా ఒకటేనని ఆయన విమర్శించారు ప్రతి ఉద్యమకారు నికి 250 గజములు ఇంటి స్థలం ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించి నేడు హామీలను విస్మరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినారు ధర్నా కార్యక్రమంలో ఉద్యమకారులు నాగవెల్లి సాంబయ్య మేకల ఎల్లయ్య శంకేసి లింగమూర్తి అంకం దేవానంద్ కెంచ ఆనంద్ కోరే సుభాష్ అయిత ప్రభాకర్ సోమ మధుకర్ బౌరిశెట్టి సదానందం బొల్లె కుమార్ స్వామి మాడిశెట్టి రాజ్ కుమార్ తాళ్ల పెళ్లి శ్రీనివాస్ కళ్యాణ వెంకటేశ్వర్లు అనుమాండ్ల శ్రీధర్ నేల మల్లమ్మ ఆవునూరి లక్ష్మి ముసిని పెళ్లి జమున కొడిపాక రమాదేవి పల్ల కొండ యాక లక్ష్మి చిదురాల సుజాత సోమ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు తదనంతరం ఇలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ఆర్ఐ వరుణ్ కు కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినారు