🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 17 Sep, 2026 | Page: 1

పేదల వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు.

వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామానికి చెందిన చల్లూరి రాజేందర్ వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడనే ఉద్దేశంతో అర్హులైన వారికి ఎల్‌ఓసీల ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చల్లూరి రాజేందర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షుడు పుట్ట తిరుపతి, వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడిపి జీవన్, వంగపహడ్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు దోమ కోర్నేల్, రుద్రారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home