🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 17 Sep, 2026 | Page: 1

వక్ఫ్‌ భూముల సర్వేకు అడ్డంకులు అధికారులు,దర్గా కమిటీ సభ్యులతో భూకబ్జాదారుల వాగ్వాదం..దాడికి యత్నం

*తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 17*
వరంగల్‌లోని బిక్కన్‌ దర్వేష్‌ రహ్మతుల్లా అలై దర్గా భూములకు సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను కొందరు అడ్డుకున్నారని దర్గా కమిటీ సభ్యులు ఆరోపించారు.సర్వే నంబర్లు 273,274,275,276లోని సుమారు 15 ఎకరాల 5 గుంటల భూమి దర్గా వక్ఫ్‌ భూమిగా ఉన్నట్లు రికార్డుల ఆధారంగా స్పష్టమవుతోందని వారు తెలిపారు.సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులు,దర్గా కమిటీ సభ్యులతో కొందరు వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.వక్ఫ్‌ భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని గతంలోనే కలెక్టర్‌,రెవెన్యూ,పోలీస్‌ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని కమిటీ సభ్యులు తెలిపారు.అయితే సర్వే ప్రక్రియను కొందరు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో దర్గా కమిటీ సభ్యుడు మహమ్మద్‌ అలీపై దాడికి ప్రయత్నించగా,అక్కడ మీడియా ప్రతినిధులు ఉండటంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపారు.వక్ఫ్‌ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి,పూర్తి వివరాలను వక్ఫ్‌ బోర్డుకు సమర్పించి భూమిని కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.సర్వేను అడ్డుకోవడం,అధికారులతో గొడవకు దిగడం,దర్గా కమిటీ సభ్యులపై దాడికి ప్రయత్నించడం సరికాదని పేర్కొంటూ సంబంధిత అధికారులు,పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీ పాషా,ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ మాస్హూక్,కోశాధికారి మహమ్మద్‌ జైనుల్‌ అబిద్దీన్‌,సంయుక్త కార్యదర్శి మహమ్మద్‌ అబ్దుల్‌ పాషా,మహమ్మద్‌ అలీ,మహమ్మద్‌ అజాజ్‌,మిర్జా యూసుఫ్‌ బేగ్‌,ఇనాయతుల్లా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home