ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలిగుడిమల్ల రవికుమార్..తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర ప్రారంభం
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 17*
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడిమల్ల రవికుమార్ డిమాండ్ చేశారు.ఉద్యమ సమయంలో లాఠీచార్జీలు,అవమానాలు,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు,సంక్షేమ పథకాలు,తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.ఇందులో భాగంగా గుడిమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తా నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర తొలి దశను ప్రారంభించారు.నాలుగు రోజులపాటు కొనసాగనున్న యాత్రలో ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను తెలుసుకుని,వారికి జరిగిన అన్యాయాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు.వరంగల్ చౌరస్తా నుంచి పోస్టాఫీస్ అండర్‌బ్రిడ్జి,చాకరాసుకుంట,కిలా వరంగల్ తూర్పు కోట,శివనగర్ మీదుగా చింతల్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ కోసం పగలు,రాత్రి తేడా లేకుండా,తిండి,నీరు లేకుండా ఉద్యమించినప్పటికీ అనేక మంది ఉద్యమకారులకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు జరిగిన నష్టాలను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యమకారులకు పదవులు,సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఓదార్పు యాత్రలో భాగంగా మిగిలిన మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమకారులను కలుస్తామని తెలిపారు.యాత్రను ప్రతి పల్లెకు,ప్రతి ప్రాంతానికి విస్తరించి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,ప్రజలు,తెలంగాణ ఐక్యవేదిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.