ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ వరంగల్ డీఐజీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
వరంగల్, సెప్టెంబర్ 17: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ డీఐజీ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వి.శ్రీనివాస్, హనుమకొండ ఏసీపీ పి.నర్సింహరావు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.