🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 17 Sep, 2026 | Page: 1

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా పోయిన మొబైల్‌ ఫోన్‌ రికవరీ సొంతదారుడికి మొబైల్‌ను అందజేసిన వరంగల్‌ జీఆర్‌పీ పోలీసులు

వరంగల్‌, సెప్టెంబర్‌ 17: రైల్వే ప్రయాణంలో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా వరంగల్‌ జీఆర్‌పీ పోలీసులు రికవరీ చేసి సొంతదారుడికి అందజేశారు.

నెక్కొండ–వరంగల్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన కమళ్ల శ్రీకాంత్‌ తన ఐక్యూ జెడ్‌6 మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. దాని విలువ సుమారు రూ.16 వేలుగా ఉంది. ఫోన్‌ పోయిన విషయంపై ఫిర్యాదు అందడంతో వరంగల్‌ జీఆర్‌పీ పోలీసులు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా దాని ఆచూకీ గుర్తించి రికవరీ చేశారు.

రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌ను వరంగల్‌ జీఆర్‌పీ సీఐ వి.నరేష్‌ కుమార్‌ గురువారం సొంతదారుడు కమళ్ల శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.రవీందర్‌ రెడ్డి, కానిస్టేబుల్‌ డి.రాము పాల్గొన్నారు.
🏠 Home