🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 18 Sep, 2026 | Page: 1

చౌటుప్పల్ మోడల్ స్కూల్ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఇంకెప్పుడు?

చౌటుప్పల్ : పట్టణంలోని లక్కారం మోడల్ స్కూల్ కు వెళ్లే మార్గం గుంతలు గుంతలు గా ఉండి, ఇబ్బందికరంగా ఉందని, స్కూలుకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థి సంఘ నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధమైందని స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని, గత నెల రోజుల క్రితం అధికారులు తెలిపారు. కానీ ఇప్పటివరకు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి వెంటనే జాప్యం చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, స్థానికులు కోరుతున్నారు.
🏠 Home