స్వయం ఉపాధికి చేయూత.. వృద్ధులకు భరోసా
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి కందుకూరి పూజ కాశీబుగ్గ లోని స్వశక్తి సధన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు, అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన "టైలరింగ్ శిక్షణ" పూర్తి చేసిన వారికి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వశక్తి భవన్ ఇన్‌చార్జి వనం.బాలరాజు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను న్యాయమూర్తికి వివరించారు.
అనంతరం ఆనంద ఆశ్రమం వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి, అక్కడ నివసిస్తున్న వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు అందుతున్న ఆహారం, వసతులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. వృద్ధులతో కొంత సమయం గడిపి, వారి అవసరాలను తెలుసుకున్నారు. వృద్ధుల పట్ల ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ఆనంద ఆశ్రమం నిర్వహణ, వృద్ధులకు అందిస్తున్న సేవల వివరాలను ఈటెల సమ్మయ్య న్యాయమూర్తికి వివరించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సెల్ పి. శ్రీనివాసరావు, దుర్గా భాయ్ మహిళా శిశు వికాస కేంద్రం డిస్ట్రిక్ట్ మేనేజర్ పి.జయశ్రీ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.