దివిస్ ఉద్యోగి మాటల ఎదురుదాడి! మేము ఒక్కరమే చెత్త పడవేస్తున్నామా అంటూ సహనం కోల్పోయి, హోటల్ వారిపై, నాయి బ్రాహ్మణులపై నిందలు.
దివిస్ ఉద్యోగులు సెప్టెంబర్ 16 న ఉదయం జాతీయ రహదారి ప్రక్కన చెత్త పడవేస్తుండగా మున్సిపల్ సిబ్బంది వారిని పట్టుకుని ,వినూత్నంగా వారి మెడలో దండ వేసి,500 రూపాయల జరిమానా విధించారు. ఇది ఈ ఉద్యోగులకు కొత్తేమి కాదు ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలా జరిగినా వారి తీరులో మార్పు రాలేదు. అందుకే ఇదే విషయం గురించి వారికి అవగాహన కల్పించమని కోరుతూ "ప్రియమైన ఉద్యోగులారా? అని సంబోధిస్తూ కొన్ని సలహాలు,సూచనలు చేస్తూ యాజమాన్యానికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి సామాజిక కార్యకర్త ఆకుల మధు వెళ్లగా ఒక ఉద్యోగి బాధ్యతారాహిత్యం గా మాట్లాడడమే గాక, దివిస్ ఉద్యోగులు ఒక్కరే చెత్త వేస్తున్నారా అంటూ నోరు పారేసుకోవడం, మాటలతో...