మాజీ సర్పంచ్ వంగాల రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన కంటెస్టెడ్ జడ్పీటీసీ జాటోతు శ్రీనివాస్ నాయక్
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామ మాజీ సర్పంచ్ వంగాల రవీందర్ గారి అత్త జంగిలి కొమరమ్మ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ జడ్పీటీసీ జాటోతు శ్రీనివాస్ నాయక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమరమ్మ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మహమ్మద్ అలీ, సులోచన చందర్, మాజీ సర్పంచ్ రేణుక నాగయ్య, తెలంగాణ ఫోరం ఉద్యమకారుల అధ్యక్షులు చల్ల వెంకన్న, బీజేపీ జిల్లా నాయకులు నాల్లం కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు భూక్య మోహన్ నాయక్, రవీందర్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.