తిప్పర్తి: మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

తిప్పర్తి: మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద చంద్రం ఫౌండేషన్‌ చైర్మన్‌, మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పిల్లాపాపలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రిపాలెం సర్పంచ్‌ కొల్లు నాగయ్య, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, సీనియర్‌ నాయకులు పల్లె శేఖర్‌, వార్డు సభ్యుడు బొంత యాదయ్యతో పాటు పల్లె శేఖర్‌, బొంత ఎంకన్న, వరికుప్పల నరేష్‌, బొంత నరేష్‌, బొంత సైదులు, బొంత...