హమారా ప్రసాద్ ను దేశ బహిష్కరణ చేయాలి. - ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బిర్రు బిక్షపతి
*భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై కల్పిత నాయకుడు అని రాసిన పుస్తకాన్ని నిలిపివేయాలి* భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై కల్పిత నాయకుడు అని వస్తున్న పుస్తకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దాని వెనుక ఉన్న సంస్థలు & వ్యక్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఆధ్వర్యంలోఖండిస్తుంది. నెక్కొండమండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బిర్రు బిక్షపతి మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పిత వ్యక్తి కాదు — ఈ దేశ సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక...