జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలు మెరుగుపర్చాలి అన్ని సూచికల్లో మెరుగైన పనితీరు సాధించాలని అధికారులకు డీఎంహెచ్‌ఓ ఆదేశం

వరంగల్, సెప్టెంబర్ 18: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి శుక్రవారం పరిశీలించారు. డీఈఐసీ, యూఎఫ్‌డబ్ల్యూసీ, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ తదితర విభాగాలను సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రికార్డులు, నివేదికల నిర్వహణను పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ విభాగాల్లో శిశువులు, చిన్నారులకు అందుతున్న వైద్య సంరక్షణ, పోషకాహారం, తదుపరి వైద్య పర్యవేక్షణ, రిఫరల్ సేవలను సమీక్షించారు. డీఈఐసీలో ఆర్‌బీఎస్‌కే ద్వారా రిఫర్‌ అవుతున్న చిన్నారుల్లో అభివృద్ధి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స, తదుపరి పర్యవేక్షణ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. యూఎఫ్‌డబ్ల్యూసీలో మహిళలకు అందుతున్న...