పరకాల సీఐ ప్రవీణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు
*తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 18* పరకాల: సాధారణ బదిలీల్లో భాగంగా పరకాల సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏ.ప్రవీణ్‌కుమార్‌ను 21వ వార్డు కంటెస్టెడ్ కౌన్సిలర్ ఒంటేరు చక్రి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఒంటేరు చక్రి మాట్లాడుతూ..విధి నిర్వహణలో భాగంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సంపూర్ణ న్యాయం అందేలా సీఐ చొరవ చూపాలని,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల 21వ వార్డు బీఆర్‌ఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి,చెన్న ఉమాపతి,స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్,ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ పెండ్యాల విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.