గజ్వేల్‌లో కొత్తగా తెలంగాణ విమోచన వేదిక

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్‌లో కొత్తగా తెలంగాణ విమోచన వేదిక ఏర్పడింది ఈ వేదిక తన తొలి ప్రధాన కార్యక్రమంతో ప్రజా చర్చకు శ్రీకారం చుట్టిన సందర్భంగా నిలిచింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి భారీ కటౌట్ ముందు 25 దీపాలను వెలిగించారు. ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రయాణాన్ని, ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రజా సేవా ప్రస్థానం నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రయాణాన్ని ప్రతీకాత్మకంగా స్మరించుకుంటూ ఈ దీపాలను వెలిగించారు. అనంతరం సంపూర్ణ “వందేమాతరం” గీతాన్ని ఆలపించగా, సభలోని ప్రతి ఒక్కరూ గౌరవంతో నిలబడి జాతీయ గీతానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను...