బాలయ్యపల్లిలో విషాదం.. మృత విద్యార్థుల కుటుంబాలకు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి పరామర్శ, రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం

గీసుగొండ మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాగిరి గణేష్, నల్ల సిద్ధార్థ ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి గారు, జిల్లా నాయకులు, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గారు, జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి గారు ఈరోజు బాలయ్యపల్లి గ్రామానికి వెళ్లి మృత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. మృత విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకుని, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా రాగిరి గణేష్ తల్లిదండ్రులు లింగమూర్తి, అనిత, అలాగే నల్ల సిద్ధార్థ తల్లిదండ్రులు అశోక్, ఉమా...