బత్తాయి పంటకు శాశ్వతమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
నల్గొండ జిల్లాలో నాలుగు దశాబ్దాల కాలంగా సాగవుతున్న వేలాది ఎకరాల బత్తాయి పంటను రైతు అమ్ముకోవడానికి నేటికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేదు. మధ్య దళారుల చేతుల్లోనే మార్కెట్ ఉండడంతో రైతులకు సరైన ధర రాక నష్టపోతున్నారు. తక్షణమే ఈ సమస్యకి శాశ్వతం మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.." అని బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నల్గొండ జిల్లా కమిటీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు విజ్ఞప్తి చేసింది. బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం జిల్లా కమిటీ ఈ మేరకు శుక్రవారం హైదరాబాదు లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది. నాలుగు...