ప్రజాభవన్‌లో ఘనంగా పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క అశోక్ కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అశోక్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ములుగు జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కష్టకాలంలోనూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ, ఎన్నికల...