కాశిబుగ్గలో ఘనంగా మహా అన్నదానం

కాశిబుగ్గ: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాశిబుగ్గ నవజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరంట్ల మనోహర్–మాధవి దంపతులు అన్నదాన వితరణ దాతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన BRS వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను, అన్నదానం విశిష్టతను కొనియాడారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బేతి అశోక్ బాబు, ఉరుగొండ రవీందర్,...