విజయవంతంగా ముగిసిన జోనల్ స్థాయి క్రీడ ఎంపికలు.
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలంలోని కొంకపాక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వర్ధన్నపేట జోనల్ స్థాయి క్రీడ ఎంపికలు ముగిసినట్టు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండల పీడీ లు పీఈటీ లను అభినందించారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ జి ఎఫ్ ఐ వర్ధన్నపేట జోనల్ సెక్రెటరీ పాషా గారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు మరియు 17 సంవత్సరాల విభాగంలో బాలబాలికలకు కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించబడ్డాయని ఇందులో మొత్తం 144 మంది విద్యార్థినీ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని...