లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో.. వడ్లకొండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూల పంపిణీ

*గ్రామ సర్పంచ్ డెక్క సునీత - కుమారస్వామి* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి,సెప్టెంబర్ 19 ( ): పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, ఆసరా పింఛన్ల అమలు తీరును ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ పథకంలో భాగంగా విద్యార్థులకు టై, బెల్ట్, షూలను ఎంపీడీవో ,గ్రామ సర్పంచ్ డెక్క సునీత–కుమారస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ భాగంగా,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు...