వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సంయుక్త పరిశీలన

*తెలంగాణ,వరంగల్,గీసుకొండ మండలం,సెప్టెంబర్ 19* గీసుగొండ: వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా,సురక్షితంగా నిర్వహించేందుకు కట్ట మల్లన్న చెరువు కట్ట,నిమజ్జన ప్రాంతాలను తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.ఫిషరీస్,మున్సిపల్,ఆర్‌అండ్‌బీ,ఎండోమెంట్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణ,భద్రత,సీసీ కెమెరాలు,విద్యుత్,రహదారులు,చెరువు కట్ట,నీటిలో భద్రత,మౌలిక సదుపాయాలపై పరిశీలన చేపట్టారు.గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించి నిమజ్జనానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు ఇప్పటికే చెరువులో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయని,అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ప్రజలు,వినాయక మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని కోరారు.