ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో డా.వలిఉల్లా ఖాద్రికి ఘన సన్మానం ఉద్యమ సేవలను గుర్తుచేసుకున్న ఐక్య వేదిక నాయకులు
తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 19 వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక చేపట్టిన ఓదార్పు యాత్ర రెండో రోజు వరంగల్ నగరంలోని ఎల్‌బీనగర్‌లో కొనసాగింది.ఈ సందర్భంగా వేదిక నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకుడు డా.సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి నివాసానికి చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా,కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యమ నాయకుడిగా,విద్యార్థి–యువజన సమస్యలపై పోరాడిన నాయకుడిగా,సమాజ సేవలో అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.వేదిక చైర్మన్ జి.రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో డా.వలిఉల్లా ఖాద్రి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా పోలీసు కేసులు నమోదయ్యాయని,జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు.విద్యార్థి ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు...