కల్లెడ లో ఘనంగా మహా అన్నదానం

పర్వతగిరి (కల్లెడ): జన చరిత్ర న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముంజాల రాజకుమార్ అన్నదాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ వీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్, మండల అధ్యక్షులు హార్కవత్ వినోద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... దానాలన్నింటిలోకి అన్నదానం అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామంలో ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సేవా...