ఉద్యమకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలి గుడిమల్ల రవికుమార్
*తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 19* వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకుడు గుడిమల్ల రవికుమార్ డిమాండ్ చేశారు.తెలంగాణ ఓదార్పు యాత్రలో భాగంగా మూడో రోజు శ్రీనివాస్ కాలనీ,దేశాయిపేట,ఎల్‌బీనగర్,లోతుకుంట, చార్బౌలి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమకారులను కలుసుకున్నారు.వారి కుటుంబాల పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ కోసం 25 ఏళ్ల క్రితం ఉద్యమించిన అనేక మంది ఉద్యమకారులు నేటికీ అదే దుస్థితిలో జీవించడం బాధాకరమన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, పదవులు,ఉద్యోగాలు,ఆర్థిక భరోసా లభించలేదని పేర్కొన్నారు.ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,అలాంటి వారిని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదన్నారు.ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు...