వాహనాల బ్యాటరీల దొంగ అరెస్ట్ రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలు స్వాధీనం..ఐదు కేసులు ఛేదించిన కేయూసీ పోలీసులు

*తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 19* హనుమకొండ: రాత్రివేళల్లో పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు,లారీల బ్యాటరీలను చోరీ చేస్తున్న నిందితుడిని కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి నుంచి సుమారు రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.కేయూసీ,మడికొండ,మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.పోలీసుల వివరాల ప్రకారం..బాలసముద్రానికి చెందిన పస్తం అయిలు కుమార్(35)ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.రాత్రి వేళల్లో జవహర్‌కాలనీ,వడ్డేపల్లి,మిల్స్‌కాలనీ,మడికొండ ప్రాంతాల్లో రోడ్లపై పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు,లారీలను గుర్తించి వాటి బ్యాటరీలను చోరీ చేసేవాడు.ఈ మేరకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి.విచారణలో నిందితుడు నేరాలను అంగీకరించడంతో అతడి నుంచి 16 బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు నమోదైనట్లు...