18వ డివిజన్ పరిధిలో యువ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని ఉత్సవాలు
వరంగల్ జిల్లా లేబర్ కాలనీ అబ్బన్ కుంట 18వ డివిజన్ పరిధిలో యువ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు సందర్భంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు వివిధ రకాల నైవేద్యాలను తీసుకువచ్చి గణనాథునికి సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని...