తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి ఉద్యమకారుల ఓదార్పుతో వారి జీవిత స్థితిగతులు తెలుస్తున్నాయి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా తొలి దశ మలిదశ ఉద్యమకారుల కోసం ఓదార్పు యాత్ర జరుగుతుందని ఈ ఓదార్పు యాత్ర వల్ల ఆనాటి ఉద్యమకారుల స్థితిగతులు స్పష్టంగా అర్థం అవుతున్నాయని అన్నారు. తొలి రోజు 25 మందిని సన్మానం చేశామని ఇప్పటివరకు 75 మందిని సన్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చినందుకు సంతోషం లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు రవికుమార్ వివరించారు. అందరూ బాధలో ఉన్నారని ఎలాంటి...