డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఏసీఎస్ చైర్మన్ బయ్యగోని కుమారస్వామి

హసన్‌పర్తి మండలం మల్లారెడ్డి పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నూతనంగా నియమితులైన బయ్యగోని కుమారస్వామి ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కుమారస్వామికి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ భేటీ అనంతరం ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి సమక్షంలో హసన్‌పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణ మరియు ప్రభుత్వ...