ఏలుకుర్తి లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు. --- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నిమ్స్ లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేష్.

గీసుకొండ. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఏలుకుర్తి హవేలి గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ లైజనింగ్ అధికారి, హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ మార్త రమేష్ తన స్వగ్రామమైన ఏలుకుర్తి హవేలిలోని వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా అర్చకులు భాగావతుల ఉమామహేశ్వర శర్మ గణపతి హోమంతో పాటు, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపించి, తీర్థప్రసాదాలు అందజేసి డాక్టర్ మార్త రమేష్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం విగ్రహా దాత రమేష్ ను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మార్త...