జనహితమే గణనాథుడి సేవ ప్రజా సంక్షేమం కోరుతూ ఈగ మల్లేశం ప్రత్యేక పూజలు

వర్ధన్నపేట, సెప్టెంబర్ 19: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిరంగడ్డ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాన్ని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి, ప్రజలకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేసేందుకు గణేశ్ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఫిరంగడ్డ యూత్ అసోసియేషన్ సభ్యులు క్రమశిక్షణతో,...