ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు:

వరంగల్: ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్‌లోని గోపాల్ స్వామి ఆవరణలో పద్మశాలి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా సంఘం నాయకులు బాపూజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి జిల్లా సంఘం నాయకులు, ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్ ,గుండేటి నరేంద్ర కుమార్ ,కుసుమ సతీష్ ,డిఎస్ మూర్తి, పద్మశాలి యువజన సంఘం నాయకులు అశోక్ బాబు...