పర్వతగిరి మండలంలోని దళితులు బీఆర్ఎస్ ప్రభుత్వo హయాంలోనే అభివృద్ధి సాధ్యం
జన చరిత్ర న్యూస్ పర్వతగిరిమండలం లోని దళితుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల మాజీ రైతుబందు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో మండలంలో దళితుల కోసం పలు కార్యక్రమాలు అమలు చేసినట్లు వారు తెలిపారు. *భూ పంపిణీతో జీవనోపాధి* బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన భూ పంపిణీ పథకం ద్వారా భూమిలేని ఎస్సీ కుటుంబాలకు వ్యవసాయ భూమి అందించే కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. వడ్లకొండ గ్రామంలో 45 ఎకరములు దళితులకు మూడు ఎకరాల చొప్పున...